దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఫ్లాట్గా ముగిశాయి. సెన్సెక్స్ ఉదయం 82,147.37 పాయింట్ల వద్ద స్వల్ప నష్టాలతో ప్రారంభమైంది. ఇంట్రాడేలో 81,776.53-82,370.38 పాయింట్ల మధ్య కదలాడింది. చివరికి 10 పాయింట్ల నష్టంతో 82,149.72 వద్ద స్థిర పడింది. నిఫ్టీ 2.15 పాయింట్లు పెరిగి 25,204.50 వద్ద ఉంది.