AP: రాష్ట్రంలో పలు జిల్లాలకు వాతావరణశాఖ పిడుగుపాటు హెచ్చరికలను జారీ చేసింది. విజయనగరం, మన్యం, అల్లూరి, విశాఖ జిల్లాలకు రెడ్ అలర్ట్.. శ్రీకాకుళం, కోనసీమ, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు ఆరెంజ్.. తిరుపతి, కర్నూలు, నంద్యాల జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించింది. అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది.