KRNL: యూరియా వాడకం తగ్గించి భూమి కాలుష్య నివారణకు తోడ్పడాలని మంత్రాలయం తహశీల్దార్ రమాదేవి, ఏవో జీరా గణేష్, ఏఈవో తిరుమల్ రెడ్డి రైతులకు సూచించారు. మంగళవారం చెత్నేహళ్లి గ్రామంలోని రైతులకు డిఏపీ, నానో యూరియా బస్తాలను అందజేశారు. నానో యూరియా వాడకం పట్ల కలిగే లాభాలను వ్యవసాయ అధికారులు రైతులకు అవగాహన కల్పించాలని ఎమ్మార్వో సూచించారు.