ప్రకాశం: ఒంగోలు కలెక్టరేట్లో మంగళవారం జిల్లా కలెక్టర్ రాజాబాబు వ్యవసాయ, అనుబంధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. జిల్లాలో అత్యధికంగా రైతులు సాగు చేస్తున్న పంటలపై ఆరా తీశారు. రైతాంగం అభివృద్ధికి తీసుకోవలసిన చర్యల గురించి సంబంధిత అధికారులతో చర్చించారు. ఉద్యానవన పంటల సాగుపై సైతం అధికారులతో మాట్లాడారు.