KDP: మైదుకూరు మండలం అన్నలూరు, సోమయాజులపల్లిలో ‘పొలం పిలుస్తోంది’ కార్యక్రమాన్ని నిర్వహించారు. రైతులు లైన్ సోయింగ్ విధానంలో వరి పంట నాటుకుంటే గాలి, వెలుతురూ బాగా తగులుతుందని ఏడీఏ కృష్ణమూర్తి తెలిపారు. చీడపీడల ఉధృతి తగ్గుతుందని తెలియజేశారు. వరిలో కొనలను తుంచి నాటడం వల్ల కాండం తొలచు పురుగు ఉధృతి తగ్గుతుందని సూచించారు.