TG: HYD హుమాయున్నగర్కు చెందిన వృద్ధుడికి రూ. 26.06 లక్షలను సైబర్ నేరగాళ్లు టోకరా వేశారు. మనీలాండరింగ్, పహల్గాం దాడితో సంబంధాలున్నాయని.. వృద్ధుడికి వాట్సాప్ వీడియో కాల్ చేసి సైబర్ నేరాగాళ్లు బెదిరించారు. NIA, ATS, DGP పేర్లతో ఉన్న అరెస్టు వారెంట్లు చూపించారు. దీంతో భయంతో FDలు, భార్య ఖాతాల్లో నగదును వారికి ఆ వృద్ధుడు బదిలీ చేశాడు.