ASR: హైడ్రో పవర్ ప్రాజెక్టుల నిర్మాణం కోసం జారీ చేసిన జీవో 51ను రద్దు చేయాలని డుంబ్రిగుడ మండలం గసభ పంచాయితీ సీపీఎం సర్పంచ్ పాంగి సునీత డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. నవయుగ, అదానీ వంటి బడా కంపెనీలకు ప్రభుత్వం ఒప్పందాలు చేయడం గిరిజన హక్కుల ఉల్లంఘనమని ఆమె విమర్శించారు. ప్రభుత్వం అనుమతులు రద్దు చేయకపోతే తీవ్రంగా ప్రతిఘటిస్తామన్నారు.