TG: సీఎం రేవంత్ రెడ్డి బీహార్లో పర్యటిస్తున్నారు. నిన్న రాత్రి శంషాబాద్ నుంచి పాట్నాకు చేరుకున్నారు. ఆయన వెంట డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి దామోదర రాజనర్సింహ, పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ ఉన్నారు. వీరందరూ ఇవాళ పాట్నాలో జరిగే CWC సమావేశంలో పాల్గొననున్నారు.