GNTR: కొండమోడు – పేరేచర్ల రహదారి నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం మంగళవారం భూసేకరణ ప్రకటన జారీ చేసింది. ఫిరంగిపురం మండలంలోని అమీనాబాద్, మేడికొండూరు మండలంలోని కొర్రపాడు, మేడికొండూరు, మంగళగిరిపాడు గ్రామాల్లో మొత్తం 14.82 హెక్టార్ల భూమిని 63 మంది యజమానుల నుంచి సేకరించడానికి జాతీయ రహదారులు, రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది.