‘తన్వి ది గ్రేట్’ మూవీ సరిగ్గా ఆడకపోవడంపై దర్శకుడు అనుపమ్ ఖేర్ స్పందించారు. ఈ సినిమాతో పాటు ‘సైయారా’ విడుదలైందన్నారు. అయితే ‘సైయారా’కు మంచి ఆదరణ రావడంతో తమ సినిమాను తొలగించారని, ఆ విషయంలో తనతో పాటు తన టీంకు చాలా బాధ కలిగిందని తెలిపారు. ఆ సినిమా కోసం తాను నాలుగేళ్లు పనిచేశానని పేర్కొన్నారు.