ATP: మంత్రి నారా లోకేష్‌ను జిల్లా ప్రజా ప్రతినిధులు కలిశారు. ఈ సందర్భంగా ఆర్డీటీకి FCRA రెన్యువల్ విషయమై చర్చించారు. కేంద్ర ప్రభుత్వం త్వరగా రెన్యువల్ చేసేలా చర్యలు తీసుకోవాలని మంత్రిని కోరారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వంతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నామని, త్వరలోనే ఆర్డీటీ సమస్యకు పరిష్కారం లభిస్తుందని హామీ ఇచ్చారు.