ప్రకాశం: రాష్ట్రంలో నల్లబర్లీ పొగాకు సాగును ప్రభుత్వం నిషేధించిందని AO ప్రసాదరావు, MRO రమణారావు అన్నారు. తాళ్లూరులో మంగళవారం రైతులకు అవగాహన నిర్వహించారు. అనుమతులు ఉన్నవాళ్లే సాగు చేయాలని సూచించారు.పొగాకు శరీరానికి చేసే నష్టాల గురించి డాక్టర్ రాజేశ్ వివరించారు. ఎవరైనా సాగుచేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ASI భాస్కర్ రావు, రైతులు పాల్గొన్నారు.