AP: గుంటూరు జిల్లాలో 3 కలరా కేసులు బయటపడటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. కలెక్టర్ తమీమ్ అన్సారీ, ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ కలిసి పరిస్థితిని పర్యవేక్షించారు. ప్రజలు కాచి చల్లార్చిన నీటిని తాగాలని సూచించారు. కలరా కేసులు బయటపడిన ప్రాంతాల్లో ఇంటింటి సర్వే కూడా నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా పానీపూరి దుకాణాలను మూసివేయాలని ఆదేశించారు.