AP: అసెంబ్లీలో మెడికల్ కాలేజీలపై చర్చ జరిగింది. నిర్మాణంలోని మెడికల్ కాలేజీలు పూర్తి కావాలంటే రూ.6700 కోట్లు కావాలని మంత్రి సత్యకుమార్ తెలిపారు. ప్రస్తుతం అంత ఖర్చు చేసే అవకాశం లేదన్నారు. 10 కాలేజీలను పీపీపీ మోడల్లో నిర్మించాలని నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వమే పీపీపీ విధానాన్ని ప్రోత్సహిస్తోందని పేర్కొన్నారు.