NLR: పెరమన రోడ్డు ప్రమాదానికి టీడీపీ నేతల ధన దాహమే కారణమని మేకపాటి విక్రమ్ రెడ్డి ఆరోపించారు. ప్రమాదం జరిగి ఆరు రోజులు కావస్తున్నా, నిందితులను ఇంత వరకు పోలీసులు అరెస్టు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. నెల్లూరులోని జిల్లా పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడతూ.. ప్రభుత్వం ప్రకటించిన నష్టపరిహారం చాలా తక్కువ అని, అదికూడా ఇంతవరకు బాధితులకు అంద చేయలేదని అన్నారు.