KMM: కొణిజర్ల మండలం విక్రంనగర్లో బుధవారం ఓ గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యం అయిందని స్థానికులు తెలిపారు. జీన్స్ ప్యాంటు, టీ షర్ట్ ధరించి ఉన్న ఓ గుర్తు తెలియని మృతదేహం కనిపించడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించి పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.