VSP: డాక్టర్ వీ.ఎస్.కృష్ణ డిగ్రీ కళాశాలలో ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి, జీవీఎంసీ, కోరమాండల్ ఫెర్టిలైజర్స్, గ్రీన్ క్లైమేట్ టీం ఆధ్వర్యంలో స్వచ్ఛతా హి సేవా, స్వర్ణ ఆంధ్ర- స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమాలు మంగళవారం జరిగాయి. ప్రిన్సిపాల్ డాక్టర్ ఐ.విజయ బాబు మాట్లాడుతూ.. వస్త్ర సంచులు వాడాలని, ప్లాస్టిక్ మానుకోవాలని, పది మొక్కలు నాటి పెంచాలని పిలుపునిచ్చారు.