డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా నిర్మాతగా ‘మేం ఫేమస్’ ఫేమ్ సుమంత్ ప్రభాస్ హీరోగా ఓ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. భద్రకాళి పిక్చర్స్ బ్యానర్‌పై రానున్న ఈ సినిమాలో హీరోయిన్గా ‘8 వసంతాలు’ ఫేమ్ అనంతిక సనీల్ కుమార్‌ను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. తెలంగాణ నేపథ్యంలో సాగే ఈ సినిమాకు రామ్ గోపాల్ వర్మ శిష్యుడు వేణు దర్శకత్వం వహించనున్నారు.