కోనసీమ: అమలాపురంలో జరిగే దసరా నవరాత్రి ఉత్సవాలను ఎటువంటి అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా పటిష్ట భద్రతా చర్యలు చేపట్టాలని రెవెన్యూ డివిజనల్ అధికారి కె. మాధవి సూచించారు. మంగళవారం ఆర్డీవో కార్యాలయంలో జరిగిన పీస్ కమిటీ సమావేశంలో అధికారులు, ఉత్సవ కమిటీ పెద్దలతో కలిసి ఏర్పాట్లను సమీక్షించారు. డ్రోన్ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.