NZB: మారుతున్న జీవనశైలిలో ఆయుర్వేదానికి ప్రాధాన్యత పెరుగుతోందని అడిషనల్ కలెక్టర్ అంకిత్ అన్నారు. జాతీయ ఆయుర్వేద దినోత్సవం సందర్భంగా మంగళవారం ఆయుష్ శాఖ ఆధ్వర్యంలో అర్సపల్లిలోని వివేకానంద యోగ కేంద్రంలో ఉచిత ఆయుర్వేద వైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ముందుగా భగవాన్ ధన్వంతరి విగ్రహానికి జ్యోతి ప్రజ్వలన చేశారు.