MBNR: ఓ బాలుడు మిస్సింగ్ అయిన సంఘటన బాలానగర్ మండల కేంద్రంలో సోమవారం రాత్రి జరిగింది. ఎస్సై లెనిన్ వివరాల ప్రకారం.. మండల కేంద్రానికి చెందిన రాజ్ పటేల్ (14) 9వ తరగతి చదువుతున్నాడు. సోమవారం రాత్రి దుర్గామాత ఉత్సవాలకు వెళుతున్న అని ఇంట్లో చెప్పి వెళ్లాడు. తిరిగి ఇంటికి రాలేదు. చుట్టుపక్కల బంధువుల ఇళ్లలో వెతికిన ఆచూకీ లభించలేదు. తండ్రి ఫిర్యాదు కేసు నమోదు చేశారు.