సంగారెడ్డి: నారాయణఖేడ్ పట్టణంలోని వెంకటాపురం గేటు వద్ద రాంరావు మహారాజ్ ట్రస్ట్ స్థలంలో బంజారా భవన్కు రూ. 2 కోట్ల నిధులు మంజూరు చేసిన ఎమ్మెల్యే సంజీవరెడ్డికి భవాని దీక్షపరులు, గిరిజనులు కృతజ్ఞతలు తెలిపారు. మంగళవారం ఎమ్మెల్యేను కలిసి హర్షం వ్యక్తం చేశారు. బంజారా భవన్తో గిరిజనుల వివాహాలు చిన్నచిన్న శుభకార్యాలు, జరుపుకోవడానికి ఎంతో సౌకర్యం ఉంటుందన్నారు.