ELR: దసరా శరన్నవరాత్రి ఉత్సవాల సందర్బంగా విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ కనకదుర్గమ్మని మంగళవారం ఎమ్మెల్యేలు పత్సమట్ల ధర్మరాజు, బోలిశెట్టి శ్రీనివాస్ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా దేవస్థానం అధికారులు ఎమ్మెల్యేలకు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి సత్కరించారు. అనంతరం వేద పండితులు ఆశీర్వచనం అందించారు.