VKB: శ్రీవెంకటేశ్వర స్వామి దేవాలయంలో శ్రీవారి రజతోత్సవ బ్రహ్మోత్సవాలు కన్నుల పండుగగా జరుగుతున్నాయి. మంగళవారం ఆలయంలో సుప్రబాత సేవ, మహాభిషేకం, నైవేద్యం, మంగళహారతి, అర్చనలు నిర్వహించారు. దర్శనాల అనంతరం శ్రీవారి కళ్యాణం ఘనంగా జరిగింది. బ్రహ్మోత్సవాల్లో స్వామి వారికి నిత్య కళ్యాణం నిర్వహిస్తున్నారు. భక్తులు భారీగా తరలివచ్చి స్వామిని దర్శనం చేసుకుంటున్నారు.