NLR: నెల్లూరు జిల్లా రాపూరు మండలం మునగాల వెంకటాపురం గ్రామ సమీపాన గల అటవీ ప్రాంతంలో 12 వ శతాబ్దం నాటి శిలాశాసనం గుర్తించినట్టు జిల్లాకు చెందిన ప్రముఖ చరిత్రకారులు రసూల్ అహ్మద్ తెలియచేశారు. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు ఈ ప్రాంతంలో కేంద్ర పురావస్తు అధికారుల బృందంతో సంయుక్తంగా బుధవారం పర్యటించారు.