కృష్ణా: మహిళల ఆరోగ్య సంరక్షణపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ వహిస్తోందని పిఎసిఎస్ ఛైర్మన్ గుత్తికొండ వంశీకృష్ణ తెలిపారు. మంగళవారం చల్లపల్లి మండలం మేకావారిపాలెం సొసైటీలో స్వస్థ నారి – సశక్త్ పరివార్ కార్యక్రమం జరిగింది. వైద్యాధికారి డాక్టర్ శివరామకృష్ణ మహిళలకు ఆరోగ్య సూచనలు చేసి వైద్య పరీక్షలు చేసి మందులు అందించారు. సొసైటీ సీఈఓ కోరుకొండ శ్రీనివాస్ పాల్గొన్నారు.