SRPT: హుజూర్నగర్ పట్టణం గోవిందపురం పరిధిలోని స్మశానవాటిక స్థలాన్ని కబ్జా నుంచి కాపాడాలని మున్సిపల్ మాజీ కౌన్సిలర్లు చిలకబత్తిని సౌజన్య, బొల్లెద్దు ధనమ్మలు ఆర్డీఓ శ్రీనివాసులు, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసరెడ్డిలను కోరారు. ఈ సందర్భంగా వారికి వినతిపత్రం అందజేశారు. ఈ విషయంపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని అధికారులు హామీ ఇచ్చారని వారు తెలిపారు.