ప్రకాశం: ఎరువులు, యూరియా అధిక ధరలకు విక్రయిస్తే శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని కనిగిరి ఎస్సై శ్రీరామ్ అన్నారు. ఇవాళ కనిగిరి పట్టణంలోని పలు ఎరువుల దుకాణాలలో తాహాసీల్దార్ శంకర్రావుతో కలిసి ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. గోడంలలో యూరియా బస్తాల నిల్వ గురించి షాపు యజమాని అడిగి వివరాలు తెలుసుకున్నారు. యూరియా రైతులకు ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే ఇవ్వాలని తెలిపారు.