VZM: గజపతినగరం మండలంలోని కెంగువ గ్రామంలోని సచివాలయం వద్ద మంగళవారం 8వ రాష్ట్రీయ పోషణ మాసం సందర్భంగా దోసకాహార స్టాల్ను ఏర్పాటు చేశారు. ఐసీడీఎస్ పర్యవేక్షకురాలు జానకి ఆధ్వర్యంలో ఆకు కూరలు, చిరుధాన్యాలు, పప్పులు, కూరగాయలు తినాలని అవగాహన కల్పించారు. అలాగే గర్భిణీలు, బాలింతలు, కిషోర్ బాలికలకు పౌష్టికాహార విశిష్టతను వివరించారు.