BDK: చర్ల మండలం ఆర్. కొత్తగూడెం గ్రామానికి చెందిన స్థానిక బీఆర్ఎస్ పార్టీ నాయకులు బెజవాడ వరప్రసాద్ అనారోగ్యంతో ఇటీవల మృతి చెందారు. ఈ నేపథ్యంలో మంగళవారం వారి కుటుంబ సభ్యులను బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, పినపాక మాజీ శాసనసభ్యులు రేగా కాంతారావు పరామర్శించారు. పార్టీ కోసం వరప్రసాద్ సేవలను కొనియాడారు.