బాలీవుడ్ స్టార్ జంట కత్రినా కైఫ్, విక్కీ కౌశల్ గుడ్ న్యూస్ చెప్పారు. తల్లిదండ్రులు కాబోతున్నట్లు సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. వారి జీవితంలో అత్యంత అందమైన దశకు స్వాగతం పలుకుతున్నట్లు తెలిపారు. ఈ మేరకు కొత్త అధ్యాయం ప్రారంభం కాబోతున్నట్లు చెబుతూ స్పెషల్ ఫొటో పంచుకున్నారు. దీంతో అభిమానులు వారికి కంగ్రాట్స్ చెబుతున్నారు.