ఖమ్మం RTC డిపో మేనేజర్‌గా శివప్రసాద్ బాధ్యతలు స్వీకరించారు. రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన RTC ఉద్యోగుల బదిలీల్లో భాగంగా ఇక్కడ పని చేసిన దినేష్ కుమార్ కామారెడ్డి జిల్లాకు బదిలీ అయ్యారు. ఈ సందర్భంగా శివప్రసాద్ మాట్లాడుతూ.. ఉద్యోగులందరి సహకారంతో ప్రయాణికులకు మెరుగైన సేవలు అందిస్తానని తెలిపారు. ప్రయాణికులకు ఇబ్బందులు లేకుండా కృషి చేస్తానన్నారు.