KKD: వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభంను మాజీ మంత్రి, కాకినాడ జిల్లా వైసీపీ అధ్యక్షుడు దాడిశెట్టి రాజా మంగళవారం కలిశారు. కిర్లంపూడిలోని ముద్రగడ నివాసానికి వెళ్లిన రాజా ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. ముద్రగడ పద్మనాభం విశ్రాంతి అనంతరం పూర్తి ఆరోగ్యంతో మళ్లీ పార్టీ కార్యకలాపాల్లో పాల్గొనాలని ఆకాంక్షిస్తున్నట్లు రాజా ఈ సందర్భంగా తెలిపారు.