తమిళ హీరో ధనుష్ స్వీయ దర్శకత్వంలో నటించిన మూవీ ‘ఇడ్లీ కడై'(ఇడ్లీ కొట్టు). అక్టోబర్ 1న రిలీజ్ కానున్న ఈ సినిమాకు U సర్టిఫికెట్ వచ్చింది. ఇక ఈ సినిమా 2:27 గంటల రన్ టైంతో విడుదల కాబోతుంది. కాగా, ఈ చిత్రంలో నిత్య మీనన్, షాలిని పాండే, సత్యరాజ్, సముద్రఖని తదితరులు కీలక పాత్రలు పోషించారు.