E.G: దేవీ నవరాత్రులు సందర్భంగా రాజమండ్రి నగరంలోని వివిధ ప్రాంతాల్లో ఆయా ఉత్సవ కమిటీలు గురువారం నిర్వహిస్తున్న దసరా మహోత్సవాలకు రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన ఆయా ఆలయాలు, ఉత్సవ పందిళ్లలో అమ్మ వారిని దర్శించుకుని పూజలు చేశారు. ప్రజలంతా సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలతో ఉండేలా దీవించాలని అమ్మ వారిని వేడుకున్నారు.