GNTR: భారీ వర్షాల కారణంగా ఎగువ ప్రాంతాల నుంచి ప్రకాశం బ్యారేజీకి భారీగా వరద నీరు వచ్చి చేరడంతో ఈ నెల 23వ తేదీ మంగళవారం మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. అయితే ప్రస్తుతం వరద ప్రవాహం తగ్గుముఖం పట్టడంతో ప్రమాద హెచ్చరికను ఉపసంహరించడం జరిగిందని జల వనరుల విభాగ అధికారులు తెలియజేశారు. గురువారం మధ్యాహ్నం వరకు బ్యారేజీ నీటి మట్టం 12 అడుగుల కంటే తక్కువ ఉంది.