అన్నమయ్య: లక్కిరెడ్డి మండల మార్కెట్ యార్డ్లో అక్టోబర్ 7 నుండి పశువుల సంత నిర్వహణకు అధికారులు సన్నాహాలు ముమ్మరం చేశారు. ఈ మేరకు మార్కెట్ యార్డ్ ఛైర్మన్ డా.SMD షఫీ నాయక్, ఏడి త్యాగరాజు గురువారం స్థల పరిశీలన చేసి, వ్యాపారులకు, ప్రజలకు అవసరమైన మౌలిక వసతులు, రైతు బజారు ఏర్పాటుపై దృష్టి సారించారు. మండలంలో ఎన్నడూ లేని విధంగా అన్ని సౌకర్యాలతో పశువుల సంతను ఏర్పాటు చేస్తామన్నారు.