ఏదో ఒక రోజు తాను పిల్లల్ని కలిగి ఉంటానంటూ బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ షాకింగ్ కామెంట్స్ చేశారు. ‘టూ మచ్ విత్ కాజోల్ అండ్ ట్వింకిల్’ షోలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ .. భవిష్యత్తులో ఎప్పటికైనా సొంత బిడ్డలను కలిగి ఉంటానని అన్నారు. అయితే దత్తత మాత్రం తీసుకోనని చెప్పారు. తన పిల్లల్ని కుటుంబ సభ్యులు పెంచి పెద్ద చేస్తారని వెల్లడించారు.