అన్నమయ్య: మదనపల్లి సబ్ డివిజన్ సబ్ కలెక్టర్ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న హోంగార్డు బి.ఈశ్వర్ నాయక్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. ఈ నేపథ్యంలో గురువారం అన్నమయ్య జిల్లా హోంగార్డులు తమ ఒక రోజు డ్యూటీ అలవెన్స్‌ను విరాళంగా ఇచ్చి ₹2, 32,172 సమకూర్చారు. ఈ మొత్తాన్ని జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి, మృతుని భార్య వి.లక్ష్మీబాయికి చెక్కు రూపంలో అందజేశారు.