W.G: తాడేపల్లిగూడెం పురాదేవత బలుసులమ్మ తల్లి ఆలయంలో 4వ రోజు దసరా ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. గురువారం అమ్మవారు ధనలక్ష్మి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. అమ్మవారి గర్భాలయం, ప్రధాన మండపాన్ని సుమారు రూ. 50 లక్షల రూపాయల నోట్లతో అలంకరించారు. ఈ ప్రత్యేక అలంకారాన్ని తిలకించడానికి భక్తులు భారీ సంఖ్యలో ఆలయానికి తరలివస్తున్నారు.