VZM: గజపతినగరంలోని బజారు జంక్షన్లో ఎంపీడీవో కళ్యాణి ఆధ్వర్యంలో గురువారం స్వచ్ఛతే సేవా కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ప్రధాన వీధుల్లో అవగాహన ర్యాలీతో పాటు పరిసరాలను పరిశుభ్రం చేశారు. ప్రజలు పరిశుభ్రత పట్ల ప్రత్యేక శ్రద్ధ కనబరచాలని సూచించారు. ఇందులో ఈవో పీఆర్డీ సుగుణాకరరావు, ఈవో జనార్దన రావు, ఏపీవో కృష్ణవేణి తదితరులు పాల్గొన్నారు.