BHPL: జిల్లా మంజూరునగర్లోని శ్రీ వేంకటేశ్వర స్వామి దేవాలయంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. గురువారం దుర్గామాత శ్రీ కాత్యాయని దేవి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే, ఆలయ ధర్మకర్త గండ్ర వెంకట రమణా రెడ్డి, జ్యోతి గార్లు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.