AP: మండలిలో పీఆర్సీపై టీడీపీ-వైసీపీ మధ్య మాటల యుద్ధం చోటుచేసుకుంది. గత ప్రభుత్వం ఉద్యోగుల సొమ్ము రూ.21 వేల కోట్లను వాడుకుందని మంత్రి పయ్యావుల ఆరోపించారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయడం లేదని వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ విమర్శించారు. ఉద్యోగుల సమస్యలు పరిష్కరించకుండా నిర్లక్ష్యం వహిస్తోందని మండిపడ్డారు. ఉద్యోగుల ఆవేదనకు మద్దతుగా వాకౌట్ చేస్తున్నట్లు తెలిపారు.