పవన్ కళ్యాణ్ ‘OG’ ప్రీమియర్ షోలో అనూహ్య ఘటన చోటుచేసుకుంది. ఈ సినిమా చూస్తూ కొందరు అభిమానులు అత్యుత్సాహంతో తెరముందుకెళ్లి కత్తితో థియేటర్ స్క్రీన్‌ను చింపివేశారు. దీంతో స్క్రీన్‌పై పెద్ద పగుళ్లు రాగా.. యాజమాన్యం షోను రద్దు చేసింది. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటన బెంగళూరులోని K.R. పురం ప్రాంతంలో ఉన్న థియేటర్లలో జరిగినట్లు సమాచారం.