PLD: 2021లో ఎన్నికైన ఉమ్మడి గుంటూరు జిల్లాలోని మండల పరిషత్తులు, జడ్పీ పాలకవర్గాలు నాలుగేళ్లు పూర్తయ్యాయి. వైసీపీ ఆధిపత్యంలో కొనసాగిన ఈ పదవులపై ఇప్పుడు మార్పుల చర్చలు జరుగుతున్నాయి. కూటమి బలపడడంతో పల్నాడు జిల్లా కారంపూడి, నరసరావుపేట ఎంపీటీసీలు అవిశ్వాసంపై ఆరా తీయడం ప్రారంభించారు. కొందరు వెనక్కు తగ్గినా, అసంతృప్తులు కొత్త నాయకత్వానికి మార్గం సిద్దం చేశారు.