అక్కినేని నాగార్జున ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. తన అనుమతి లేకుండా తన ఫొటోలు, పేరును వాడుకోకుండా ఆదేశాలు ఇవ్వాలని పిటిషన్ దాఖలు చేశారు. గతంలో కూడా వ్యక్తిగత హక్కుల కోసం అమితాబ్ బచ్చన్, ఐశ్వర్య, అభిషేక్ బచ్చన్ ఢిల్లీ హైకోర్టుకు వెళ్లారు. ఇప్పటికే కోర్టు.. సినీనటుల అనుమతి లేకుండా వారి పేరును, ఫొటోలు వాడుకోవద్దంటూ ఉత్తర్వులు జారీ చేసింది.