MHBD: కేసముద్రం మండలంలోని నారాయణపురం గ్రామంలో దారుణం జరిగింది. పందుల మనీష్ అనే బాలుడిని గుర్తుతెలియని వ్యక్తులు ఉరేసి హత్యచేశారు. బుధవారం రాత్రి ఘటన చోటు చేసుకోగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా గత జూలైలో గుర్తుతెలియని వ్యక్తులు బాలుడిపై కత్తితో దాడిచేయగా ఇంట్లోవారు అరవడంతో దుండగులు పారిపోయారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.