W.G: భీమవరం యనమదుర్రు డ్రైన్‌పై నిర్మించిన బ్రిడ్జిలకు అప్రోచ్ రోడ్లు వెంటనే నిర్మించాలని డిమాండ్ చేస్తూ సీపీఎం ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. జిల్లా కార్యదర్శి జేఎన్వి గోపాలన్ మాట్లాడుతూ.. 14 సంవత్సరాలు గడిచినా రోడ్లు నిర్మించకపోవడం దారుణమన్నారు. అలాగే, నాగేంద్రపురంలో బ్రిడ్జికి సైడ్ వాల్స్ లేకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.