AP: తిరుమలలో ఏఐ ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ను సీఎం చంద్రబాబు ప్రారంభించారు. కమాండ్ కంట్రోల్ సెంటర్ పనితీరును అధికారులు సీఎంకు వివరించారు. క్యూలైన్లలో వేచి ఉండే భక్తులకు శ్రీవారి వైభవం తెలియజెప్పేలా వీడియోలు ప్రదర్శించాలని సీఎం సూచించారు. టీటీడీ నిర్వహణలోని అన్ని ఆలయాలనూ కమాండ్ కంట్రోల్ సెంటర్కు అనుసంధానించాలని తెలిపారు.