KDP: ప్రభుత్వం ఉల్లి సాగు చేసిన రైతులను ఏమాత్రం ఆదుకోవడం లేదని ఏపీ రైతు సేవా సమితి జిల్లా అధ్యక్షుడు రమణ మండిపడ్డారు. ఇందులో భాగంగా లింగాలదిన్నె గ్రామంలో సాగు చేసిన ఉల్లి పంటను రైతులతో కలిసి పరిశీలించారు. కాగా, హెక్టారుకు రూ.2 లక్షల వరకు రైతులు ఖర్చు చేస్తే.. ప్రభుత్వం కంటి తుడుపు చర్యగా హెక్టార్‌కు రూ.50 వేలే ఇస్తామని చెప్పటం బాధాకరమన్నారు.